Saturday, May 3, 2025
- Advertisement -

ఇదేనా పారదర్శకత…చంద్రబాబుపై షర్మిల ఫైర్!

- Advertisement -

కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే..ఏపీ లిక్కర్ పాలసీలో మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుందని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు.. మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారు అని ప్రశ్నించారు.

ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై, సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని ఆరోపించారు షర్మిల. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగిందని …సాధారణ ప్రజలను బెదిరించి మద్యం షాపులను దక్కించుకున్నారన్నారు.

కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరికైనా లాటరీ చిక్కితే లైసెన్స్ ఇస్తారా? అని ప్రశ్నించారు షర్మిల. మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తాం అంటూ బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -