Wednesday, May 7, 2025
- Advertisement -

వైసీపీ 9వ జాబితా రిలీజ్..

- Advertisement -

వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు ఆగడం లేదు. తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన 9వ జాబితాను రిలీజ్ చేశారు. తాజా జాబితాలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జులను నియమించింది.

ప్రధానంగా అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జ్‌గా విజయసాయిరెడ్డిని నియమించింది. కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్, మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జ్‌గా మురుగుడు లావణ్య పేర్లను ప్రకటించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా ప్రకటించినా తాజాగా ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది.

రెండు రోజుల క్రితం 8వ జాబితా రిలీజ్ చేయగా అందులో 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ఒంగోలు ఎంపీగా, చంద్రగిరి అసెంబ్లీ సీటును మోహిత్ రెడ్డికి కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -