వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ముస్లిం సముదాయానికి అభ్యంతరకరంగా ఉండటంతో, వాటిని సవాల్ చేస్తూ కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 13, 14, 25, 26లను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని… చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజుల్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 9,14 ప్రకారం ముస్లిమేతరులను బోర్డుల్లో చేర్చే విధానాన్ని, ఆ సంస్థల అంతర్గత వ్యవస్థల్లో తలదూరజేసే చర్యగా అభివర్ణించింది.
ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్ పార్టీకి చెందిన ఎంపీలు, తమిళనాడుకు చెందిన విజయ్, ముస్లింలకు చెందిన పలు సంస్థలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.