గెలిచినా ఓడినా ప్రజల కోసమే పనిచేస్తామని తెలిపారు వైసీపీ నేత దేవినేని అవినాష్. జగన్ ఆదేశాలతో ఏదైతే రూ.1 కోటి రూపాయలు ఆయన విరాళంగా ప్రకటించారో దానికి అనుగుణంగా బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బాధితులకు అందజేస్తున్నామని చెప్పారు.
ఎవరైతే బాధితులు ఉన్నారో నిత్యవసర సరుకులు వారి ఇంటి వద్దకే తీసుకెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందిస్తున్నారని చెప్పారు. తాము గెలిచినా ఓడినా ప్రజల కోసమే పనిచేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలా షో రాజకీయాలు మాత్రం చేయం అన్నారు.
మొదటి దశలో లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్, రెండో దశలో 70 వేల పాల ప్యాకెట్లు, లక్ష వాటర్ బాటిల్స్ అందించారు వైసీపీ నేతలు. ఇప్పుడు మూడో దశలో నిత్యావసరాల సరుకుల కిట్ పంపిణీ చేశారు. వివక్షతకి తావులేకుండా బాధితులందరికీ ఇళ్ల వద్దే అందజేస్తున్నారు వైసీపీ నేతలు.
50 వేల వరద బాధిత కుటుంబాలకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో బెల్లం, కందిపప్పు, మిల్క్ ప్యాకెట్, ఆయిల్, గోధుమ రవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక కిట్ లాగా తయారుచేసి ఇంటింటికీ ఇచ్చారు వైసీపీ నేతలు.