అధికారం కొల్పోవడంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీకి కే.రవిచంద్రారెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో వీడియో ద్వారా స్పందించారు శ్రీరెడ్డి. పార్టీలో ఏ గుర్తింపు లేకపోయినా జగన్ అన్నకి సపోర్ట్ చేయాలని కోరారు శ్రీరెడ్డి.
దయ చేసి ఎవరు పార్టీ కష్ట కాలం లో వదిలివెళ్లకండి ప్లీజ్ అని చెప్పుకొచ్చింది. పార్టీ గుర్తింపు లేని ,పార్టీ గుర్తింపు ఇవ్వని అనేక మంది నా లాంటి కార్యకర్తలు ఉన్నారు అండి పార్టీ లో ..మా వెనుక వచ్చిన వాళ్ళు ఎందరో మంచి పోసిషన్ లో కూర్చుని స్పీచెస్ ఇస్తుంటే వాళ్ళ వీడియోస్ కూడా promote చేస్తున్నాం అన్నారు. ఏదో రోజు గుర్తిస్తారని ఆశ తో వున్నాం..బాధలు ఎన్ని వున్నా ,కానీ పార్టీ ని నేతి మీద పెట్టుకుని చూసుకుంటాం మేమంతా..మీకేం తక్కువైందో దేవుడు కి తెలియాలని తెలిపింది.
ఇక తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు రవిచంద్రారెడ్డి. పార్టీ పదవితో పాటు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు రవిచంద్రారెడ్డి. అయితే పార్టీకి ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన కాసేపటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు.