మెగాస్టార్ చిరంజీవికి నటి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కౌంటర్ ఇచ్చారు. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన చిరు.. తను ఇంట్లో చుట్టూ మనవరాల్లే ఉంటారని ..తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా అనిపిస్తుందని కామెంట్ చేశారు. అంతేకాదు ఇప్పుడైనా కొడుకును కనాలని చరణ్‌కు చెబుతుంటానంటూ తెలిపారు చిరు.
దీనిపై ఘాటుగా స్పందించారు శ్యామల. కొడుకే వారసుడు అవుతాడా.. కూతుర్లు కారా.. అని సూటిగా ప్రశ్నించారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే భ్రమ నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందని చురకలు అంటించారు. చిరంజీవి కోడలు ఉపాసన అన్నీ చక్కగా నడుతున్నారు..వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు.
ఏపీలో మహిళలకు రక్షణ కరువు అని శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ విద్యార్ధులకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆపేసి వారి జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు.ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని తేల్చిచెప్పారు.