తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. టీటీడీ లడ్డు ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని కోరారు వైసీపీ తరపు న్యాయవాదులు. దీనిపై బుధవారం వాదన వింటామని తెలిపింది న్యాయస్థానం.
శ్రీవారి లడ్డు గురించి చంద్రబాబు ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టుని ఆశ్రయించాం అని తెలిపారు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి హైకోర్టులో పిల్ వేశారని, బుధవారం ఈ కేసు గురించి హైకోర్టులో విచారణ జరగనుందని వెల్లడించారు.
నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు AR డెయిరీ వెల్లడించింది. జూలైలో 16 టన్నుల నెయ్యి టీటీడీకి సరఫరా చేశాము.. స్వచ్చమైన నెయ్యినే ఇచ్చామని ల్యాబ్ రిపోర్ట్స్ విడుదల చేసింది చెన్నైకి చెందిన AR డెయిరీ.