Monday, May 5, 2025
- Advertisement -

ప్రజల గుండెల్లో వైఎస్‌..స్టేడియం పేరు మార్చి సాధించేదేంటీ?

- Advertisement -

మహానేత వైఎస్ మననుండి దూరమై ఏళ్లు గడుస్తున్న ఆయన జ్ఞాపకాలు ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. ప్రజానాయకుడిని ఇప్పటికి ప్రజలు ఆరాధిస్తున్నారంటే వైఎస్ పట్ల ఉన్న ప్రేమ, ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే కూటమి సర్కార్ వైఎస్ పేరు లేకుండా చేయాలనే అక్కసుతో వ్యవహరిస్తోంది.

ఇందులో భాగంగానే విశాఖ క్రికెట్ స్టేడియంకు పెట్టిన వైఎస్‌ఆర్ పేరును తొలగించేందుకు సిద్ధమైంది. దీనిని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహానేత వైయస్‌ఆర్ ఆనవాళ్ళను తుడిచేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం అని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

విశాఖపట్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైఎస్ పేరును పెడుతూ 2009లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది విశాఖలోని వైఎస్ఆర్‌ స్టేడియం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఎఎన్‌యులో ఉన్న వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించారు… ఆ తర్వాత బాపట్లలో వైయస్‌ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. సీతకొండ వ్యూపాయింట్‌కు వైయస్‌ఆర్ పేరు పెడితే దానిని ధ్వంసం చేశారు. రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ పథకాలకు వైయస్ఆర్ పేరును తొలగించారు. ఇప్పుడు విశాఖ అంతర్జాతీయ స్టేడియంకు ఉన్న వైయస్‌ఆర్‌ పేరును కూడా తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి ఇలాగే కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని నేతలు హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -