అక్రమ కేసులే..టీడీపీ చేసే అభివృద్ధా!

అక్రమ కేసులే టీడీపీ చేస్తున్న అభివృద్దా అని ప్రశ్నించారు వైసీపీ నేతలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి?. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు అన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.

వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నారు మల్లాది విష్ణు. 30 మంది పోలీసులు ఇంటికెళ్లి మరీ బెదిరించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తోంది. పౌర హక్కులను హరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు అన్నారు.

వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం అన్నారు కరణం ధర్మ శ్రీ. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని.. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు అన్నారు దేవినేని అవినాష్. తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు.

వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా అన్నారు భూమా కారుణాకర్ రెడ్డి. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్‌ చేశారు… చంద్రబాబు, లోకేష్‌ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు అన్నారు.