Saturday, May 3, 2025
- Advertisement -

పేపర్ మిల్ కార్మికులను దగా చేసిన టీడీపీ!

- Advertisement -

పేపర్ మిల్లు యాజమాన్యంతో, కార్మికులతో మాట్లాడి ఆరువేల పెంపుకోసం మా ప్రభుత్వ హయాంలో ప్రయత్నించాం. జీతం పెంపు అగ్రిమెంట్ మేమే చేసామంటూ టీడీపీ మాట్లాడటం పచ్చి అబద్ధం అన్నారు పేపర్ మిల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చౌదరి. పేపర్ మిల్ కార్మికులను చంద్రబాబు, నారా లోకేశ్ దగా చేశారన్నారు.

ఆరువేల పెంపుకోసం ప్రయత్నిస్తుంటే పదివేలు వచ్చేలా చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఏడు నెలలు అయినా పట్టించుకోలేదు. జీతాల పెంపు కోసం కార్మికులు స్ట్రైక్ కు సిద్ధపడితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ప్రధాని వస్తున్నారని మభ్యపెట్టి స్ట్రైక్ కాల్‌ఆఫ్ చేయించారు అని దుయ్యబట్టారు.

కూటమి పాలన వల్ల రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పారిశ్రామిక వేత్తలను ఫోన్‌ చేసి బెదిరించాడు. కోట్ల రూపాయలు తనకు కట్టాలంటూ వేధించాడు. రాష్ట్రంలో ఇంలాంటి పరిస్థితి ఉంటే అసలు పరిశ్రమలు పెట్టేందుకు ఎవ్వరైనా ముందుకొస్తారా? చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు జీతం 10వేలకు పెంచేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామని నమ్మబలికారు. నమ్మి ఓటేసిన తర్వాత ఏడు నెలలు అయినా జీతం పెంపు అగ్రిమెంట్‌ అతీగతీ లేదు అని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -