చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్కా మాణిక్య వరప్రసాద్ పాకులాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కనకరావు.. విశ్వసనీయత లేని వ్యక్తి డొక్కా అని ఫైర్ అయ్యారు.
పదవుల కోసం నిత్యం పార్టీలు మారే వ్యక్తి డొక్కా మాణిక్య వరప్రసాద్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దగ్గర ఉన్న ఎర్ర బుక్కులో డొక్కా పేరు కూడా ఉంది. వైయస్ఆర్‌సీపీ వారిని ఎంత తిట్టినా పదవులు రావని గ్రహించాలి. వైయస్ జగన్‌కి డబ్బు పిచ్చి ఉందని డొక్కా నోటికొచ్చినట్టు మాట్లాడారు అన్నారు.
రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరవెల్లిలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాసే నైజం డొక్కా సొంతం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి నేడు టీడీపీలో ఉన్న వరకు ఎన్నిసార్లు పార్టీలు మారారో ప్రజలకు తెలుసు అన్నారు. రాజీనామా చేసిన పార్టీల్లోకి మళ్లీ తిరిగి చేరుతున్న డొక్కా లాంటి వ్యక్తికి సిద్దాంతాల గురించి తెలుసా? అని ప్రశ్నించారు.
జగన్‌పై డొక్కా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కనకారావు. వైసీపీలో ఉంటూనే టీడీపీ వారితో మంతనాలు చేసేవాడు… ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే టీడీపీకి వెన్నుపోటు పొడిచిన చరిత్ర డొక్కాది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొక్కా మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు… మాదిగ కుల ద్రోహి డొక్కా. మాదిగ కులాన్ని వాడుకుని పదవులన్నీ డొక్కా అనుభవించాడే కానీ, మాదిగల సమస్యలపైన ఏరోజూ మాట్లాడలేదు అన్నారు.