Tuesday, May 6, 2025
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలేవి?

- Advertisement -

టీడీపీలో ఒక ఎమ్మెల్యే త‌రువాత ఒక‌రు వివాద‌స్పదం అవుతున్నారు. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు వైఖ‌రిని పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. రైతులను కుక్కలతో పోల్చడం, మహిళల నుండి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

అలాగే అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని దగ్గరుండి మరి కూలగొట్టించడం, వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతో అనుచిత ప్రవర్తన, స్థానిక పార్టీ కేడర్‌ను పట్టించుకోకపోవడం ఇలా ఒకటి కాదు అన్నింట్లో తన హస్తవాసిని ప్రదర్శిస్తున్నారు కొలికపూడి శ్రీనివాసరావు.

తాజాగా మహిళ అని కూడా చూడకుండా భూక్య చంటిపై ఇటీవల దాడి చేశారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. మనస్థాపంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయగా కొలికపూడి దురాగతానికి బలైన భూక్య చంటికి అండగా నిలిచారు వైయస్‌ఆర్‌సీపీ నేతలు.

భూక్య చంటీని పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేరుగు నాగార్జున, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, నల్లగట్ల స్వామిదాసు, నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. మహిళపై దాడి చేసిన కొలికపూడిపై ఏం చర్యలు తీసుకున్నావ్ అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -