కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ పార్టీ లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేయరాదు. ఈ నేపథ్యంలోనే అనుమతి కోసం సీఈసీకి లేఖ రాసింది వైసీపీ.
ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ కింద నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది.
గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 5న ఫీజుపోరుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి లేఖను రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,900 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. 2019-24వరకు వైసీపీ పాలనలో రెగ్యులర్‌గా ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకుందని అప్పిరెడ్డి పేర్కొన్నారు.ఈసీ తీసుకునే నిర్ణయం ఆధారంగా వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం జరగనుంది.