ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇప్పటికే జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదర్చాడమే కాదు వైసీపీ తరపున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు.
వైసీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని జగన్ పిలుపునివ్వగా..బాధితులకు తమ వంతు సాయం అందచేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా వరద బాధితులకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం ప్రకటించారు. నెల జీతం విరాళంగా ప్రకటించగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనుంది వైసీపీ.
ఇప్పటికే జగన్ ప్రకటించిన కోటి రూపాయల సహాయాన్ని వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంకా బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించారు జగన్. తాజాగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.