ఓ వైపు నేతలు పార్టీని వీడుతున్నా మరికొంతమంది నేతలు సైలెంట్ అయి పోయినా వైసీపీ అధినేత జగన్ మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా పార్టీ వాయిస్‌ని ప్రజలకు బలంగా వినిపించాలని డిసైడ్ అయ్యారు జగన్. ఇందులో భాగంగా ఇకపై వైసీపీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనేది వీరేనని తెలిపారు జగన్.
ఈ జాబితాలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారితో పాటు మరో 14 మంది పేర్లు ఉన్నాయి. పొత్తా శివశంకర్ రెడ్డి, యనమల నాగార్జున యాదవ్, సుందర రామశర్మ, కారుమూరి వెంకటరెడ్డి, కొండా రాజీవ్, నారుమల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్, నారాయణమూర్తి, అవుతు శ్రీధర్ రెడ్డి, కొమ్మూరి కనకారావు, వంగవీటి నరేంద్ర, పోతిన మహేష్, గూడపురెడ్డి వీరశేఖర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఇకపై వీరు మాత్రమే వైసీపీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొననున్నారు.
ఎందుకంటే కొంతమంది సీనియర్ నేతలు టీవీ డిబేట్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన జగన్..వైసీపీ తరపున అధికారికంగా టీవీ డిబేట్లలో పాల్గొనే వారి లిస్ట్‌ను రిలీజ్ చేశారు.