Saturday, May 3, 2025
- Advertisement -

14 ఏళ్లు చంద్రబాబు ఏం పీకాడు!

- Advertisement -

మంత్రి నారా లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది వైసీపీ. గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని…టీడీపీ చెప్పిన అబద్దాలకు సంబంధించి పలు ప్రశ్నలను ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.

1. అధికారంలోకి రాగానే త‌ల్లికి వంద‌నం పేరుతో ఇంట్లో ఎంత మంది స్కూల్‌కు వెళ్లే పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?

2. అధికారంలోకి రాగానే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం క‌ల్పిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? క‌ల్పించారా?

3. అధికారంలోకి రాగానే ఏడాదికి 5 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? క‌ల్పించారా?

4. నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?

5. ఏటా జ‌న‌వ‌రి 1న జాబ్ క్యాలెండ‌ర్ ప్రక‌టిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ప్రక‌టించారా?

6. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పింది మీరు కాదా? చేశారా?

7. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు వేతనం రూ.5వేల నుంచి రూ.10 వేలు పెంచుతామ‌ని చెప్పింది మీరు కాదా? పెంచారా?

8. అధికారంలోకి రాగానే మ‌హిళ‌ల‌కు మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?

9. రైతులకు ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది మీరు కాదా? చేశారా?

10. 19 నుంచి 59 ఏళ్ల లోపు మ‌హిళ‌లంద‌రికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆర్థిక స‌హాయం చేస్తామ‌ని చెప్పింది మీరు కాదా? స‌హాయం చేశారా?

11. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల‌కు 50 ఏళ్లకే రూ.4వేలు పింఛ‌న్ హామీ ఇచ్చింది మీరు కాదా? ఇచ్చారా?

12. ఉద్యోగుల సీపీఎస్‌, జీపీఎస్ విధానాన్ని పునఃస‌మీక్షిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? స‌మీక్షించారా?

13. అధికారంలోకి రాగానే ఉద్యోగుల‌కు ఐఆర్‌, డీఏ ప్రక‌టిస్తామ‌ని హామీ ఇచ్చింది మీరు కాదా? చేశారా?

14. అధికారంలోకి రాగానే విద్యుత్ బిల్లులు త‌గ్గిస్తామ‌ని హామీ ఇచ్చింది మీరు కాదా? త‌గ్గించారా? పెంచారా?

15. రాష్ట్రం 14 ల‌క్షల కోట్ల అప్పుల్లో ఉంద‌ని ప్రచారం చేసింది మీరు కాదా? మీరే రూ.7ల‌క్షల కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదా?

16. రాష్ట్రంలో 30వేల మంది మ‌హిళ‌లు అదృశ్యమ‌య్యార‌ని ప్రచారం చేసింది మీరు కాదా? అయ్యారా?

17. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ దొరికింద‌ని, అదంతా వైయ‌స్ఆర్ సీపీ వాళ్లదే అని ప్రచారం చేసింది మీరు కాదా? అది అస‌త్యమ‌ని తేలిపోలేదా?

18. తిరుమ‌ల ప్రసాదాల్లో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని అస‌త్య ప్రచారం చేసింది మీరు కాదా? క‌ల్తీ అయిందా?

ఇప్పుడు చెప్పు లోకేష్ ఎవ‌రిది ఫేక్ పార్టీ అని వైసీపీ నిలదీసింది. గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని సూచించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు అని ప్రశ్నించింది. నీకు గుర్తు ఉందో లేదా.. విశాఖకు రైల్వే జోన్ వద్దు, విజయవాడకు ఇవ్వండి అంటూ నాటి ఎంపీలు రాయపాటి, గల్లా జయదేవ్ చేత కేంద్రానికి మీ బాబు లేఖలు రాయించింది మరిచిపోయావా? అని ప్రశ్నించింది. 14 ఏళ్లు సీఎంగా ఉండి నువ్వు ఏం పీకావని ఇంటికి వెళ్లి మీ బాబును అడుగు అని మండిపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ఎంత చేశారో చూడమని పలు ఉదాహరణలు చెప్పింది.

– స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు మాత్రమే ఉంటే జ‌గ‌న్ వ‌చ్చాక మరో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం చుట్టారు. వాటి కోసం వేల కోట్లు ఖ‌ర్చు చేశారు.

– శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్‌ హార్బర్, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిరమండలం రిజర్వాయర్‌ ఎత్తిపోతల పథకానికి జ‌గ‌న్ శంకుస్థాప‌న చేసి ప‌నులు మొద‌లు పెట్టారు.

– ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను నిర్మించారు.

– జగన్ కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -