వైసీపీ అధికార ప్రతినిధిగా మాజీ మంత్రి రోజాను మాజీ సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి ప్రజల్లో చర్చ జరుగుతుందని ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం అని మండిపడ్డారు. . పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించిన వాటిని రద్దు చెయ్యమని చంద్రబాబు ప్రభుత్వం ఎన్ ఎం సి కి లేఖ రాయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు తన పాలన లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పిపిపి విధానం పేరు తో ప్రయివేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ఈర్ష్య, ద్వేషం తో సీఎం చంద్రబాబబు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ని నాశనం చేయాలనుకోవడం, ప్రతిభ గల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకోవడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలనలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాలలు అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు రోజా.