Saturday, May 3, 2025
- Advertisement -

షర్మిలతో ఆస్తుల వివాదం..వైసీపీ కీలక నిర్ణయం!

- Advertisement -

షర్మిలతో జరుగుతున్న ఆస్తుల వివాదానికి పుల్ స్టాప్ పెట్టింది వైసీపీ. దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని పార్టీ శ్రేణులకు, నేతలకు పిలుపునిచ్చింది. షర్మిలతో ఆస్తుల వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది.

ప్రభుత్వం కావాలనే ప్రజాసమస్యలను డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుటుంబ గొడవలను తెరపైకి తీసుకొచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది కానీ, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, వాటిని అమలు చేయడం లేదన్నారు.

మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం, సూపర్‌ 6- సూపర్‌ 7లు మోసాలే అయిన పరిస్థితులు, విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్‌డెలివరీ గవర్నెన్స్‌ ఇలా అన్నీ పడకేశాయి. కరెంట్ ఛార్జీల బాధుడుకు రంగం సిద్ధం, వీటికితోడు ఉచిత పంటలబీమాకు మంగళం పాడారు.
ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ కుటుంబంలో వ్యక్తిగత అంశాలను తెరపైకి వచ్చి రాజకీయ లబ్ది పొందాలని కుట్రలు చేశారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఇకపై ఈ వ్యవహారాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని వైసీపీ నిర్ణయించింది. ప్రజా సంబంధిత అంశాలే ప్రాధాన్యతగా, కూటమి ప్రభుత్వ నయవంచనలను ప్రశ్నించడంపైనే నిలదీయాలని పార్టీ శ్రేణులకు సూచించింది వైసీపీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -