Sunday, May 4, 2025
- Advertisement -

సంక్రాంతి తర్వాతే వైసీపీ లిస్ట్!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు వందరోజుల సమయం మాత్రమే ఉండగా దూకుడు పెంచారు సీఎం జగన్. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టగా త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని భావించినా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత ఉండనుందని తెలుస్తోంది.

సంక్రాంతి తర్వాత మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి లిస్ట్ రిలీజ్ చేయడం ద్వారా వారంత ప్రజల్లోనే ఉండే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక, స్థానాల మార్పుపై క్షుణ్ణంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు జగన్. ఓవైపు పలు సర్వే సంస్థలతో పాటు ఇంటలిజెన్స్ నివేదకలను కూడా పరిశీలిస్తున్నారు.

ఇందులో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, మంత్రులకు స్థాన చలనం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నారు. ఇక టికెట్ దక్కని వారికి ప్రాధాన్యం ఇస్తామని జగన్ స్పష్టమైన హామీ ఇస్తున్నారు. ఇక ఇవే సమయంలో పార్టీ ఆదేశాలు ధిక్కరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. మొత్తంగా రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జగన్. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు నెల రోజుల ముందుగానే అభ్యర్థుల ఎంపిక ఉంటే, అసంతృప్తులను బుజ్జగించే ఛాన్స్ ఉండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు జగన్. ఇక టికెట్ దక్కని నేతలు సైతం జగన్ వెంటే నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ ఓ సారి మాట ఇస్తే తప్పరు. అందుకే వైసీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించేందుకు నేతలంతా సమాయత్తం అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -