నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని తెలిపారు వైఎస్ జగన్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన జగన్.. వైసీపీ అంటే వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అన్నారు. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
15 ఏళ్ల మన ప్రయాణంలో 10 ఏళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూనే వస్తున్నాం అన్నారు. కళ్లు మూసి తెరిచే సరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరో మూడు, నాలుగు సంవత్సరాల్లో మళ్లీ ఈసారి వచ్చేది వైయస్ఆర్‌సీపీనే. ఈరోజు వైయస్ఆర్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడు అన్నారు. ఏ
కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఈ 10 నెలల కాలంలో, ఎన్నికల వేళ వాళ్లు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ గాలికెగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ.. ఏది చూసినా కూడా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి కనిపిస్తోంది అన్నారు.
వైయస్ఆర్‌సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైయస్ఆర్‌సీపీ ప్రయాణంలో మొదటి రోజు నుంచి.. ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ప్రజల కష్టాలనువైయస్ఆర్‌సీపీ తమ కష్టాలుగా భావించి, ప్రజల తరపున వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోందని చెప్పారు.
వైసీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై, వారికి అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ.. ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అదే విధంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు జగన్.