రాష్ట్రంలో దొడ్డిదారిన కౌన్సిలర్లకు కొనుగోలు చేస్తూ అధికారాన్ని దక్కించుకుంటున్న టీడీపీకి వెంకటగిరి మున్సిపాలిటీలో షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పదవి పొందాలనుకున్న టీడీపీ కుట్రలో భాగం కాలేదు వైసీపీ కౌన్సిలర్లు.
చైర్మన్‌పై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 20 మంది వైసీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్లలో 20 మంది కౌన్సిలర్లు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ రామ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఏకతాటిపై నిలబడి చైర్మన్ పదవిని నిలబెట్టుకున్నారు.
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వెంకటగిరి కౌన్సిలర్లు తగిన బుద్ది చెప్పారన్నారు రామ్‌కుమార్ రెడ్డి. 25 మంది కౌన్సిలర్స్ మా గుర్తు మీద గెలిస్తే.. ఆరుగురిని టీడీపీ లాక్కుందని, 19 మంది మాపై నిలబడ్డారని తెలిపారు. వైసీపీ కౌన్సిలర్ల దెబ్బకి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు దిమ్మ తిరితిరిగిందన్నారు. వైసీపీ వైపు నిలిచిన వారికి పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.