మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కోటరీ నడిపింది ఎవరో ఆయనకు తెలియదా ? చెప్పాలన్నారు. మా పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 అంటూ స్థానాలు ఏం లేవు … ఒక లిక్కర్ కేసు కాదు మా పార్టీ వాళ్లపై ఎన్నో అక్రమ కేసులు పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసు అని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు అన్నారు. విజయసాయి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు… పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది అన్నారు. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అన్నారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్ వన్ నుంచి 100 వరకూ అన్నీ జగన్ రెడ్డే అన్నారు. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు అని దుయ్యబట్టారు.