- Advertisement -
ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పిఠాపురం, వైయస్ఆర్ జిల్లా, సత్యసాయి జిల్లాలో దారుణాలు మరువకముందే .తాజాగా తెనాలిలో యువతిని కోమాలోకి వెళ్లేలా కొట్టారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు. ఐతా నగర్‌కి చెందిన యువతిని శనివారం బెదిరించి కారులో తీసుకెళ్లి దాడి చేశాడు నవీన్.
తలకి బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది యువతి. ఆసుపత్రిలో చేర్చి పరారయ్యారు నవీన్. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రాగా అధి కారమదంతో గత 4 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గుండాలు దాడులకి తెగబడుతున్నారని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో యువతిని కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ నవీన్… తలపై కొట్టడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది ఈ ఘటన. రాష్ట్రంలో పాలన ఉందా.. ఉంటే పాలిస్తున్నది రావణాసురుడా? నారాసురుడా ? అని ప్రశ్నించారు.