Monday, May 5, 2025
- Advertisement -

సర్దార్ సినిమా దుమ్ములేపుతుంది!

- Advertisement -

పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. గోపాల గోపాల సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ సర్దార్ సినిమాని రెస్ట్‌ లేకుండా షూటింగ్‍లో పాల్గొంటున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమా లో పవన్ సరసన కాజల్ హిరోయిన్‍గా నటిస్తుంది.

ఎలాగైన ఈ సమ్మర్‍కు రిలీజ్‍ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే అభిమానులో సర్దార్ సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో ఎరోస్ సంస్థ ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ దగ్గర నుండి 90 కోట్లకి కొనుకుంది. ఈ సినిమాకి సిడెడ్‍లో కూడా భారీగా అమ్ముడుపోయిందట.

సీడెడ్ మరియు ఆంధ్రలోని ఆని ఏరియాలకి కలిపి 43 కోట్లకి అమ్మేశారట. భారీగా అంచనాలు ఉండటం వల్ల ఇంత బారీ మొత్తానికి అమ్ముడుపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లు వసులు చేస్తుందని అభిమానులు అంటున్నారు. హైదరబాద్  షెడ్యూల్ కాంప్లీట్ అవ్వగానే కేరళలో షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -