బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రెంజ్‍ని పెంచాడు దర్శకధీరుడు రాజమౌళి. దాదాపు రెండున్నరేళ్ళు కష్టపడి సినిమాని తెరకేక్కించి అద్భుతమైన హిట్ కొట్టారు. తెలుగులోనే కాక అన్ని భాషలో ఈ సినిమా రికార్డ్ సృష్టించింది.
ఈ సినిమాతో రాజమౌళికే కాదు ఈ సినిమాలో నటించిన హీరో ప్రభాస్, విలన్ గా నటించిన రానాలకు కూడా మంచి పెరు వచ్చింది. ఐతే ప్రస్తుతం బాహుబలి టీం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉంది. బాహుబలి 1 ఎక్కువ శాతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు కానీ ఈ సారి బాహుబలి 2 ఓ భారీ షెడ్యూల్ ని యుఎస్ లోషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ కేరళ ప్రాంతంలో జరుగుతుండాగా ఇక్కడ షూట్ అయ్యిపోగానే యుఎస్ వేళ్లానుందట. బాహుబలి మొదటి భాంగం కన్న రెండోవ భాగం అద్భుతంగా రావడానికి రాజమౌళి చాలా కృషి చేస్తున్నాడట. వచ్చే సంవత్సరం ఈ బాహుబలి 2 విడుదల కానుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో జక్కన్న ఇంకేన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.