- Advertisement -
మహేష్ బాబు – మురుగదాస్ ల సినిమా ప్రకటించిన దగ్గర నుంచీ చాలా ఆసక్తిగా ఉన్నారు ఫాన్స్. వారిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారింది.
ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా చుట్టేయడానికి కంగారుగా ఉన్నాడట. మురుగదాస్ సినిమా త్వరగా మొదలెట్టాలి అని తొందర పడుతున్న ప్రిన్స్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో విశేషమైన సెట్స్ లో సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఒక స్పెషల్ సెట్ లో మహేష్ బాబు, సత్యరాజ్, తనికెళ్ళ భరణిల నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. తెలుగు తమిళంలో ఒకేసారి ఈ సినిమా విడుదల అవుతుంది. దీన్ని త్వరగా పూర్తి చేసి మురుగదాస్ సినిమా మొదలెట్టేయాలి అని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు మహేశ్.