Friday, April 26, 2024
- Advertisement -

బాలీవుడ్ లో ఆకాశమే నీ హద్దురా..! హీరో హీరోయిన్లు ఎవరంటే ?

- Advertisement -

బాలీవుడ్ లో ప్రస్తుతం రిమేక్స్ కాలం నడుస్తోంది. దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన చిత్రాలు హిందీ సినీ పరిశ్రమలో రీమేక్ చేసి వదులుతున్నారు. ఒక రకంగా అక్కడ డైరెక్ట్ సినిమాల కంటే ఈ రీమేక్ ల హవానే ఎక్కువగా ఉంది. తెలుగు నుంచి కూడా జెర్సీ, అర్జున్ రెడ్డి తదితర చాలా సినిమాలను రీమేక్ చేశారు. ఇప్పుడీ జాబితాకు సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ అపర్ణ బాలమురళి ఈ సినిమాలో అదరగొట్టిన విషయం తెలిసిందే.

మరి బాలీవుడ్ లో వారి పాత్రలు ఎవరు చేస్తారన్నది ఆసక్తికంగా మారింది. ఇందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. సూర్య పాత్రను అక్షయ్ కుమార్, అపర్ణ బాలమురళి పాత్రను రాధికా మదన్ .. హిందీ రీమేక్ లో చేయబోతున్నట్లు సమాచారం. సుధా కొంగర హిందీ రీమేక్ కు కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. సుధా కొంగరే తెలుగు, తమిళ్ వెర్షన్లకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రం పీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఈ సినిమాలో మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా రాధికా మదన్ కనిపించబోతోంది. సెట్స్ లోకి వెళ్లే ముందే ఆ ప్రాంతానికి చెందిన మాండలికాన్ని రాధికా మదన్ నేర్చుకోనున్నట్లు సమాచారం. పృథ్విరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, గోర్ఖా తదితర సినిమాలతో ప్రస్తుతం అక్షయ్ బిజీగా ఉన్నారు. పిప్పా, సనా సినిమాలను రాధిక చేస్తోంది. అక్షయ్, రాధికా మదన్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -