Sunday, May 4, 2025
- Advertisement -

హవ్వ : అడగగానే లిప్ కిస్ ఇచ్చేసిన ఇలియానా

- Advertisement -

నాజూకు నడుముతో ఇలియానా డాన్స్ చేస్తూ ఉంటె థియేటర్ లో కుర్రాళ్ళు అందరూ సంతోష పడేవారు. ఆ రోజులు పోయి చాలా కాలమే అయ్యింది ఆమె ప్రస్తుతం తెలుగు లో ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఖాళీగా ఉంది. ఆమె మూడేళ్ళ నుంచీ ఒక్కటంటే ఒక్క కామ్యో కూడా తెలుగులో చెయ్యలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

అప్పట్లో టాలీవుడ్ ని లైట్ తీసుకుని బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసిన ఆమె ఇప్పుడు అక్కడ కూడా తిరస్కరణ ఎదురు కోవడం విశేషం. ఆమె సినిమాల్లో రెండేళ్ళకి ఒక్కటి కూడా విడుదల అవ్వలేదు. అక్షయ్ కుమార్ రుస్తుం లో హీరోయిన్ గా చేసిన ఇల్లీ ఈ సినిమా మీద భారీగా ఆశలు పెట్టేసుకుంది. అక్షయ్ కుమార్ సినిమాలకి భారీగా గిరాకీ ఉంటోంది. పైగా మనోడు వరసగా ఎయిర్ లిఫ్ట్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ లు కొడుతుంటే ఫుల్ జోష్ తో ఈ సినిమా ప్రమోషన్ లలో పాల్గొని పనిలో పనిగా తనని తాను ప్రోమోట్ చేసుకుంటోంది ఇలియానా.

కాగా ఈ సినిమాలో హీరోతో అమ్మడుకి ఓ లిప్ లాక్ సీన్ కూడా ఉందట, దాంతో ఇలియానా ఆ సీన్ ని సంబరపడుతూ హ్యాప్పీగా చేసేసిందట. అంత హ్యాప్పీ ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో పెర్ఫార్మెన్స్ ఉన్నాలేకున్నా హాట్ సీన్స్ కంపల్సరీ అవ్వడంతో ఈ సీన్స్ సినిమాలో తనని హైలెట్ చేస్తాయని అమ్మడు భావిస్తుందట. మరి ఇలియానా ఆశలు ఎంతవరకు నిజమవుతాయో తేలాలి అంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -