Monday, May 5, 2025
- Advertisement -

బన్నీ ఏం చేస్తాడో మరి?

- Advertisement -

పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అనే మాటను పట్టుకుని సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది. అయినా బన్నీ ఏ మాత్రం తగ్గ లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ‘చెప్పను బ్రదర్’ అనేసాడు.

ఈ వివాదం ఇలా ఉంటే…. అల్లు వారి హీరోకు మరో తలనొప్పి వచ్చి పడింది. ట్విట్టర్లో ‘చీప్ అల్లు పాలిటిక్స్’ పేరుతో మహేష్ ఫ్యాన్స్ ట్రెండింగ్ క్రియేట్ చేసారు. ఇది కూడా నేషనల్ లెవల్లో ట్రెండింగ్ అవుతోంది. బ్రహ్మోత్సవం సినిమాకు థియేటర్లు దక్కకుండా అల్లు వారు థియేటర్లు బ్లాక్ చేసారని, మహేష్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోవడానికి కారణం ఇదే అనే ప్రచారం జరుగుతోంది.

నేటి సాయంత్ర మెగా ఫ్యామిలీ తొలి హీరోయిన్ నిహారిక నటించిన ‘ఒక మనసు’ ఆడియో వేడుక ఉంది. ఈ వేడుకకు అతిథిగా బన్నీ కూడా హాజరవుతున్నాడు. బయట జరుగుతున్న వివాదాలపై చాలా కోపంగా ఉన్న బన్నీ ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో బరస్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఒక వేళ అదే జరిగితే తన తొలి సినిమా ఆడియో వేడుక రచ్చరచ్చ అవుతుందనే ఆందోళనలో ఉందట నిహారిక. సాధారణంగా బన్నీ చాలా వరకు కంట్రోల్డ్ గానే ఉంటాడు. కానీ ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో పాల్గొనే పవన్ ఫ్యాన్స్ రెచ్చ గొడితే మాత్రం బన్నీని ఆపడం ఎవరి తరం కాదు అని చర్చించుకుంటున్నారు. అదే జరిగితే ‘చెప్పను బ్రదర్’, ‘చీప్ అల్లు పాలిటిక్స్’ వివాదాలపై బన్నీ తగిన సమాధానం చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -