మెగా ఫ్యామిలీ అనగానే ముందిగా గుర్తొచ్చేది చిరంజీవి. ఇప్పటికి చిరుని టాప్ స్టార్ గా చూస్తారు. ఇక చిరంజీవి తర్వాత స్థానం ఎవరిది అని చూసుకుంటే ముందుగా గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఈ మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అల్లు అర్జున్, రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్, అల్లు శీరిష్ లు వచ్చారు.
ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శీరిష్‍లను పక్కన పెడితే… పవన్ తర్వత స్థానం ఎవరిది అనే ప్రశ్న అందరిలో కలుగుతుంది. ఐతే ఈ మధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‍కి సరైన హిట్ లేదు. దాంతో మనోడి సినిమాకి కలెక్షన్స్ రావడం కూడా తగ్గింది. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ వంటి వరస ప్లాప్ రావడంతో బాక్స్ ఆఫిస్ వద్ద మెగా అభిమానులను అలరించడంలో చెర్రీ విఫలం అయ్యాడు. మూస కథలను ఎంచుకుంటు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా పడుతున్నాడు.
సో ఇక పవన్ తర్వాత స్థానానంలో నేను ఉంటా అంటున్నాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. వరస సినిమాలతో దూసుకేల్తున్నాడు. రేసుగుర్రం, సత్యమూర్తి, సరైనోడు వంటి వరస హిట్స్ తో అల్లు అర్జున్ దూమ్ములేపుతున్నాడు. ఈ మూడు సినిమాలు అదిరిపోయే రెంజ్ లో కలెక్షన్స్ రాబట్టాయి. సో మొత్తాన్నికి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నెమ్ తో వచ్చి తనకంటు ఓ పేరును క్రీయేట్ చేసుకున్నాడు.