Monday, May 5, 2025
- Advertisement -

బాహుబలి షూటింగ్ మొత్తం ఇక్కడే!

- Advertisement -

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చెప్పిన దర్శకుడు రాజమౌళి.  బాహుబలి ది బిగినింగ్ అద్భుతంగా తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడికే కాక ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలకు కూడా మంచి పేరు వచ్చింది.

ఇక మొదటి భాగం భారీ విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు రెండో భాగాన్ని మొదటి భాగం కన్న ఇంక అద్భుతంగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు జక్కన్న. ఇందుకోసం బాహుబలి రెండో పార్ట్ లో యుద్ధం సన్నివేశాల్ని అమెరికా బల్గేరియా లో షూట్ చేద్దామనుకున్నారు. అలాగే మంచు కొండల్లో కొన్ని ఫైట్ సీక్వెన్స్ తీయడానికి  విదేశాల్లో షెడ్యుల్ లను ప్లాన్ చేశారు.

కాని ఇప్పుడు విదేశాలకు వెళ్ళకుండా ఇక్కడే  హైదరాబాద్ లోనే భారీ భారీ సెట్స్ వేసి చిత్రికరిస్తున్నారట. ఈ సన్నివేశాలను అద్భుతంగా తెరకేక్కిస్తున్నాడట దర్శకుడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని దసరా కానుకగా రిలీజ్ చెయనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -