Monday, May 5, 2025
- Advertisement -

నానీ మీద కోపంగా ఉన్న బాలకృష్ణ ఫాన్స్

- Advertisement -

చిన్న హీరోలూ ,చిన్న బడ్జెట్ సినిమాలూ ఈ మధ్య పెద్ద హీరోలని భారీగా వాడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వాడకం అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఫాన్స్ ని తమ సినిమాల వైపు ఆకర్షించడం కోసం వారికి పోలిన డైలాగులూ, సీన్ లూ పెడుతూ పారడీలతో సినిమా వైపు ఆసక్తి తెప్పిస్తూ ఉంటారు డైరెక్టర్ లు . కానీ కృష్ణ వాడి వీర ప్రేమ గాథ సినిమా విషయంలో భిన్నంగా జరుగుతోంది వ్యవహారం.

ఈ సినిమా లో బాలయ్య ఫాన్ గా నానీ కనిపించబోతున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం జై బాలయ్య అంటూ టాటూ కూడా వేయించుకున్నాడు నానీ. ‘ జై బాలయ్య’ అనే టైటిల్ ని కూడా పెడదాం అనుకున్నారట అసలు. కానీ ఏమైందో తెలీదు టైటిల్ సంగతి మార్చితే మార్చారు కనీసం ట్రైలర్ లో కానీ , పాటల్లో కానీ ఎక్కడా బాలయ్య ప్రస్తావనే లేదు. 

సినిమా షూటింగ్ స్టార్టింగ్ చేసినపుడు.. ఇదే బాగా హైలైట్ అయింది. బాలయ్యను నాని బాగా ఉపయోగించుకుంటున్నాడని నందమూరి ఫ్యాన్స్ ని ఇలా ఆకట్టుకుంటున్నాడని అన్నారు.కానీ అలాంటిది మచ్చుక్కి కూడా కనపడక పోవడం తో కావాలనే బాలయ్య ని అవాయిడ్ చేస్తున్నాడు నానీ అని నందమూరి ఫాన్స్ అతని మీద సీరియస్ గా ఉన్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -