Wednesday, April 24, 2024
- Advertisement -

ఆ సినిమా సీక్వెల్ లో బాలయ్య బాబు?

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో ఒక మంచి కమర్షియల్ కథ ని చేయాలి అనే ఉదేశ్యం తో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ అయినా దగ్గర నుండి ఒక మంచి కమర్షియల్ సినిమా తో ఆయన ప్రేక్షకుల ముందుకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే ఈ విషయం లో ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఒక వైపు కె ఎస్ రవికుమార్ తో ఒక సినిమా ఒప్పుకున్నా, మరో వైపు బోయపాటి తో కూడా సినిమా చేసే ఆలోచన లో ఉన్నా బాలకృష్ణ మాత్రం ఈ విషయమై అర్ధం కావడం లేదు.

కాకపోతే ఇటీవలే విడుదల అయినా కల్కి అనే సినిమా కి రానున్న రెండో భాగం లో బాలయ్య నటించే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. అయితే కల్కి అనే సినిమా బాలకృష్ణ కోసమే దర్శకుడు ప్రశాంత్ వర్మ తయారు చేసాడు అనే వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేల్చేశారు దర్శకుడు. ఈ సినిమా రాజశేఖర్ కోసమే చేశారని, ఆయనకీ నచ్చిందని, వెంటనే చేశారని ప్రశాంత్ వర్మ చెప్పారు.

ఇక బాలకృష్ణ తో కూడా సినిమా చేసే ఆలోచన ఉందని వెలిబుచ్చారు. ఆయన సన్నిహిత వర్గాలు కల్కి కి రెండో భాగం బాలయ్య బాబు తో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -