Sunday, May 4, 2025
- Advertisement -

చెన్నైలో భారతీయుడు 2..

- Advertisement -

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లై, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది భారతీయుడు 2.

మరోసారి అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వనుండగా జూలైలో సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -