Sunday, May 4, 2025
- Advertisement -

దేవర..ఫ్యాన్స్‌కు పండగే!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం దేవర. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసింది. పఠాన్, వార్, ఫైటర్ వంటి చిత్రాల్లో అద్భుతమైన స్టెప్స్‌ను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -