ఈ క్రిస్మస్‌కు బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా సాగనుంది. బాలీవుడ్ బాద్ షా వర్సెస్ టాలీవుడ్ బాద్ షా తొలిసారి బాక్సాఫీస్ వద్ద తలడనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్‌తో వస్తుండగా షారుఖ్ నటిస్తున్న డంకి రెండు క్రిస్మస్ రేసులో నిలబడ్డాయి. ఇక ఈ రెండు ప్రాజెక్టులపై భారీ అంచనాలుండగా రెండు ఒకేసారి రిలీజ్ అవుతుండటం ఫ్యాన్స్‌కు పండగే అయినా బాక్సాఫీస్ మధ్య మాత్రం నార్త్ వర్సెస్ సౌత్ పోరే.
ప్రభాస్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ అయింది. క్రిస్మస్ కానుకగా అధికారికంగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. డిసెంబర్ 22న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇక రీసెంట్‌గా జవాన్‌తో హిట్ కొట్టారు షారుఖ్ ఖాన్. పఠాన్, జవాన్ రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ రెండు సినిమాలు రూ.1000 కోట్లు కలెక్ట్ చేశాయి. తాజాగా షారుఖ్ నటించిన డంకి కూడా క్రిస్మస్ కానుకగా రానున్నట్లు తెలుస్తోంది. అపజయమే ఎరుగని రాజ్ కుమార్ హీరాణి ఈ మూవీకి దర్శకుడు కావడంతో ఈ సినిమా కూడా హిట్ కావడం ఖాయమనే తెలుస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద జరిగే ఈ పోరులో ఎవరు విజేతగా నిలిచినా అభిమానులకు మాత్రం కనులపండగే.