చాలా సినిమా కథలు ఒక హీరో కోసం అని రాస్తే ఇంకో హీరో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసమని కథలు రాశారు. కానీ పవన్ తిరస్కరించడంతో రవితేజను వరించాయి.
ఇడియట్, అమ్మ, నాన్న తమిళ అమ్మాయి సినిమాలు రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి కోణంలోనే ఒక హీరోకోసమని చేసిన కథను ఇంకో హీరో చేసి హిట్ కొట్టాడు. మామూలు హిట్ కాదండోయ్… సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.
అదేంటంటే ఈ స్కిప్ట్ ముందుగా రచయిత రాజమోళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బన్నీ కోసం రెడీ చేసి.. తనకు వినిపించాడట. ఇది విన్న అల్లుఅర్జున్ నేను ఈ సబ్జెక్టుకి కనెక్ట్ కాలేనని చెప్పేశాడట. ఆ తర్వాత కూడా టాలివుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోలని అడిగారట. వాళ్ళు కూడా ససేమిరా అన్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా విని కొన్నాళ్ళు అగి చేద్దాం అన్నాడట.
ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ మొత్తం ట్రావెల్ చేసిన ఈ కథ చివరికి ముంబైకి చేరుకుంది. బాలివుడ్‌లో మొదటగా అమీర్ ఖాన్ విని కథ బాగుంది. కానీ నాకు డేట్స్ లేవని చెప్పాడట. పైనల్‌గా డైరెక్టర్ కబీర్‌ఖాన్ ద్వారా సల్మాన్‌ఖాన్ విని వెంటనే చేద్దాం అనడంతో సెట్స్ మీదకు వెళ్ళిందట. వారం తేడాలో రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలు రెండూ బ్లాక్ బస్టర్ కావడం టాలివుడ్ ఇండస్టీకి గర్వకారణమే..
ఇదిలా ఉండగా టాలివుడ్ ఇండస్ట్రీలో ఇంకో వార్త సంచలనం రేపుతోంది. ఇదే కథ బన్నీ కనుక చేసి ఉంటే టాలివుడ్‌లో బాహుబలి రికార్డ్‌ను బ్రేక్ చేసేవాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే సల్మాన్ చేసిన భజరంగీ భాయ్‌జాన్ బ్లాక్ బస్టర్ కావడమే ఇందుకు కారణం. మొత్తం మీద బన్నీ ఒక మంచి బ్లాక్‌బస్టర్ సినిమా మిస్ అయినట్లే…