‘కత్తి’ రీమేక్‌తో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. తెలుగు నేటివిటికి అనుగుణంగా కాస్త మార్పులు చేర్పులు చేయాలంటూ దర్శకుడు వివి వినాయక్‌కి అప్పగించారు. ఇక సినిమాకి సంబంధించిన వ్యవహారాల్ని చరణ్ మొదలుపెట్టాడు.
ఇలా పనులన్నీ చకచకా జరుగుతున్న నేపథ్యంలో రైటర్ నరసింహారావు ‘ఈ సినిమా కథ నాది’ అంటూ తెలుగు రైటర్స్ అసోసియేషన్‌లో కంప్లయింట్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అదేంటి? ఇది మురుగదాస్ తీసిన సినిమా కదా..? నీదెలా అవుతుంది? అని ఆ రైటర్‌ని ప్రశ్నించగా.. అప్పుడు అతను అసలు విషయాన్ని బయటపెట్టాడు.
తాను ఈ కథని 2010లోనే హీరో విజయ్‌కి చెప్పానని.. దానిని మొదలుపెడదామని ప్రయత్నాలు చేస్తే మధ్యలోనే అర్థతరంగా ఆగిపోయిందని నరసింహారావు వెల్లడించాడు. అయితే.. 2014లో తాను రెడీ చేసిన కథతో మురుగదాస్ ‘కత్తి’ సినిమా తీశాడని.. అది చూసి తాను ఖంగుతిన్నానని అన్నాడు. దీనిపై తాను విజయ్, నిర్మాతలకు ఫిర్యాదు చేసి ఫలితం దక్కలేదని.. అలాగే మురగదాస్‌పై కంప్లయింట్ ఇచ్చినా పెద్దగా స్పందనేం రాలేదని వాపోయాడు. చివరికి తనకు న్యాయం జరగలేదని అన్నాడు. ఇప్పుడు ఇదే కథను చిరు తెలుగులో తీయాలని ఫిక్స్ కావడంతో.. ఈసారైనా తనకు న్యాయం చేయాల్సిందేనని పేర్కొన్నాడు. దీంతో.. చిరు 150వ చిత్రం పట్టాలెక్కకముందే చిక్కుల్లో పడింది. అయితే.. ఇప్పుడీ యవ్వారం సెటిల్ అయిపోయిందని సమాచారం.
నరసింహారావుకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో.. అక్కడి నుంచే ఇతనికి న్యాయం జరిగేలా చేశారట. అంటే.. తమిళ నిర్మాతల నుండే అతనికి నష్టపరిహారం ఇప్పించేశారట. దీంతో.. ఈ ఇష్యూ ఇక్కడితో ముగిసిపోయిందని.. ఇక చిరు 150వ చిత్రానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఫిల్మ్‌నగర్ పెద్దలు అంటున్నారు. కాగా.. జూన్ 6వ తేదీ నుంచి చిరు సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. అప్పటినుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ జరిపేలా మూవీ యూనిట్ ప్లాన్ చేసింది.