చిరంజీవి వీరాభిమానులకి కూడా విరక్తి వచ్చేంత లేట్ చేస్తున్నారు చిరంజీవి 150 వ చిత్రం దాదాపు రెండేళ్ళ నుంచీ ఈ విషయం మీద నానుస్తూ నానుస్తూ వస్తున్నారు. మొదట్లో చాలా ఆసక్తికరంగా ఉండేది కానీ తరవాత తరవాత నీరసం వచ్చేసింది.
ఎన్నో డేడ్ లైన్ లో ఎన్నో అడ్డంకులూ వచ్చివ్ వెళ్ళాయి ఎందఱో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ల పేర్లు కూడా మారాయి. అదిగో ఇదిగో అంటూనే సగం కాలం వేస్ట్ చేసారు. మొన్న దసరాకు అనౌన్స్ మెంట్ పక్కా అన్నారు. కానీ తర్వాత చిరు కానీ చరణ్ కానీ పత్తా లేరు. అసలు మెగా కాంపౌండ్ నుంచి సౌండే లేదు. చిరుతో కత్తి రీమేక్ చేస్తాడనుకున్న వినాయక్ అసలు సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.
ఇప్పుడు చిరు 150 అంటేనే ఆసక్తి పోయేలా చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా విశేషాల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అంటున్నారు . చిరంజీవి అభిమానుల సంఘంలో కీలక వ్యక్తులు మన వెబ్సైటు కి అందిస్తున్న సమాచారం ప్రకారం సంక్రాంతి కే ఈ విశేషాన్ని ప్రకటిస్తాడు రాం చరణ్.
జనాల్లో ఫ్రస్టేషన్ తారా స్థాయికి చేరుతుందన్న ఉద్దేశంతో సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా గురించి ప్రకటన చేసి వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.