మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. ఈ పెళ్లి పనులు పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడట. కొద్ది రోజుల క్రితమే శ్రీజకు చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
ఇటివలే మెగాస్టార్ తన ఇద్దరు కూతుళ్లు మరియు కోడలితో కలిసి ఓ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాడు. ఒక పక్క తన 150వ సినిమా పనులు చూసుకుంటునే ఇటు తండ్రిగా తన బాద్యత వహిస్తున్నాడు. పెళ్ళి పందిరి, పసుపు కొమ్ములు దంచే కార్యక్రమం.. ఇల ప్రతి ఒక్కటి దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు మెగాస్టార్.
సినీ పరిశ్రమలో అతిరథ మహారథులతో పాటు వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు. ఈ పెళ్లిని చిరు చాలా గ్రాండ్‍గా చేయబోతున్నాడట. మెగాస్టార్ కూతురు వివాహం అనేసరికి మెగా అభిమానులు సంతోషంతో వున్నారు