Tuesday, May 6, 2025
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ ను గురి చూసి కొట్టాడు

- Advertisement -

కొన్నాళ్లకు సినిమాల్లో నటించడం ఆపేస్తా… రచయితగా సినిమాల్లో కంటిన్యూ అంటూ పవన్ కళ్యాణ్ ఆ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చి.. అందరినీ ఆలోచనలో పడేశాడు. ముఖ్యంగా అభిమానులకు పూర్తిగా కన్ ఫ్యూజ్ చేసేశాడు. ఇక తమ పవర్ స్టార్ సినిమాలకు దూరమైనట్టే అని అందరిలో అనుమానం కూడా కలిగించాడు.. పవన్. కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ వేడుకలో.. చిరంజీవి చేసిన కామెంట్లు.. పవన్ అభిమానుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి.

పవన్ కు జోడు గుర్రాల స్వారీ చేయగల సామర్థ్యం ఉందనీ.. అటు రాజకీయాలు చేసుకుంటున్నా.. ఇలు సినిమాలు మాత్రం వదలొద్దనీ.. వేల మంది అభిమానుల సాక్షిగా చిరంజీవి రిక్వెస్ట్ చేశాడు. తమ్ముడు సినిమాల్లో నటిస్తేనే.. తనకు, తన భార్యకు ఆనందమనీ చెప్పుకొచ్చాడు. తన మాటను పవన్ కాదనడు.. అన్న నమ్మకాన్ని కూడా చిరు… సర్దార్ సభా వేదికపై వ్యక్తం చేశాడు. ఇదంతా విని ముసిముసి నవ్వులతో పవన్ సిగ్గుపడ్డా… సినిమాలు కంటిన్యూ చేసే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇదంతా పక్కన పెడితే.. కొన్నాళ్లుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు, చిరంజీవికి దూరం పెరిగిందన్న వార్తలు వినిపించాయి. కానీ.. సర్దార్ ఆడియో రిలీజ్ కు చిరు రావడంతోనే.. పవన్ ఫ్యాన్స్ సగం కూల్ అయ్యారు. ఇప్పుడు.. సినిమాలు ఆపొద్దంటూ పవన్ కు చేసిన రిక్వెస్ట్ తో.. మరింతగా చిరంజీవి వారికి దగ్గరయ్యాడు. దీంతో.. గతంలో లాగే మెగా ఫ్యాన్స్ కలిసి పని చేస్తారని అంతా అనుకుంటున్నారు. అయితే.. ఇదంతా రాజకీయం కోసమే అని వాదించే వాళ్లు కూడా ఉన్నారు. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో.. చిరు అండ్ కో కే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -