Tuesday, May 6, 2025
- Advertisement -

చిరు వేసిన స్కెచ్!

- Advertisement -

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇంకా పట్టాలెక్కకముందే ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అదేనండి.. ఈ సినిమా కథ తనదేనంటూ రైటర్ నరసింహారావు రైటర్స్ అసోసియేషన్‌లో ఆమధ్య ఫిర్యాదు చేశాడు. కోలీవుడ్‌లో న్యాయం జరగని తనకు.. ఈసారి ఎలాగైనా న్యాయం చేకూర్చాల్సిందేనని కోరాడు.

ఈ కథను వాడుకున్నందుకుగాను మూడు కోట్లు ఇవ్వాలంటూ ఆ రచయిత డిమాండ్ చేశాడు. దాంతో.. ఈ వ్యవహారం తేలేదాకా ఈ చిత్ర షూటింగ్‌కు 24క్రాఫ్ట్‌లోని ఎవ్వరూ పనిచేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసింది. ఆ రైటర్‌కి మూడు కోట్లు ఇచ్చేయడం చిరు 150వ సినిమాకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అయితే.. ఈ వ్యవహారం వెనుక చిరు ఓ స్కెచ్ వేసినట్లు వార్తలొస్తున్నాయి.

అదేమిటంటే.. తన కథను వినియోగించుకునందుకు రూ.3 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన నరసింహారావుకు.. అంత మొత్తం ఇచ్చేందుకు చిరు ఒప్పుకోలేదట. డబ్బింగ్ కథ కోసం మరీ ఇంత డబ్బు ఇవ్వడానికి ఇష్టపడని ఆయన.. తన 150వ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న లైకా ప్రొడక్షన్స్ అధినేతలతో అతనికి రెండు కోట్ల మేర పరిహారం ఇప్పించారని సమాచారం. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించింది ఆ సంస్థే కాబట్టి.. చిరు మాటను కాదనలేక వారు ఆ మొత్తాన్ని రచయిత నరసింహారావుకు చెల్లించారని సమాచారం. ఇదీ.. చిరు వేసిన స్కెచ్ అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాగా.. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి అనుగుణంగా తమిళ ‘కత్తి’ స్ర్కిప్ట్‌లో మార్పులు చేసిన చిరు 150వ చిత్రం షూటింగ్ జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -