పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కసితో తెరకెక్కిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి రోజుకో ముచ్చట వినిపిస్తోంది. ముందు ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిలో ఈ సినిమా ఆడియో విడుదల చేస్తారని ప్రచారం జరిగినా.. తర్వాత హైదరాబాద్ లోనే మెగా బ్రదర్స్ సమక్షంలో సర్దార్ పాటలు వస్తాయని మరో వార్త వినిపించడం మొదలైంది.
ఈ మధ్య సర్దార్ షూటింగ్ సెట్ కు చిరంజీవి వెళ్లి అందర్నీ పలకరించడంతో.. ఈ వార్తలో కాస్త వాస్తవం ఉండి ఉందని మెగా ఫ్యాన్స్ అంతా నమ్ముతున్నారు. అలాగే.. పవన్ ఫ్యాన్స్ ను డైరెక్ట్ గా తిట్టేసిన మెగా బ్రదర్ నాగబాబు కూడా.. సర్దార్ ఆడియో రిలీజ్ కు వచ్చి.. ఫ్యాన్స్ కు వివరణ ఇస్తారని కొందరు చెబుతున్నారు.
ఈ రెండూ కాక.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న చిరంజీవి 150వ సినిమాపై కూడా.. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ నాడు మెగాస్టార్ క్లారిటీ ఇవ్వొచ్చన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయిన వాళ్ల మధ్యలో.. తన రీ ఎంట్రీని ప్రకటించడమే మంచిదని చిరు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ప్రచారంతో.. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఎప్పుడు విడుదలవుతుందా? అని మెగా ఫ్యాన్స్ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.