Saturday, May 3, 2025
- Advertisement -

విశ్వంభర..చిరు సరసన ఇద్దరు!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేయగా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఫాంటసీ మూవీ ఇదే.

ఈ చిత్రంలో ఇప్పటికే త్రిష హీరోయిన్‌గా కన్ఫామ్ కాగా ఊర్వశి రౌటేలా కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్స్‌ సురభి, ఇషా చావ్లా నటిస్తుండగా ఇప్పటికే వీరిద్దరూ విశ్వంభర సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఇక చిరు సరసన నటించే అవకాశం రావడంతో ఈ ఇద్దరు భామల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చిత్రంలో తాను హాఫ్ శారీలో ట్రెడిషనల్ గా కనిపించబోతున్నట్లు తెలిపింది సురభి. తన పాత్ర కీలకంగా ఉండనుందని చెప్పి అందరి అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -