కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్టును సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా దేవరలో జాన్వీ కపూర్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించబోతుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఆమె పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని టాక్.
విడుదలకు ముందే దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకోగా ఆడియో రైట్స్ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.