Sunday, May 4, 2025
- Advertisement -

ట్రెండింగ్‌లో దేవర ‘ఫియర్ సాంగ్’

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందు ఫ్యాన్స్‌కి మేకర్స్‌ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలోని ఫస్ట్ సాంగ్‌…ఫియర్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారగా రామ‌జోగ‌య్య‌శాస్త్రి పాట రాశారు.

అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీతం అందించడమే కాదు అద్భుతంగా పాట పాడగా దేవ‌ర‌-లార్డ్ ఆఫ్ ఫియ‌ర్‌గా పాట నెక్ట్స్ లెవ‌ల్ ఎలివేష‌న్ ఇస్తోంది. పాట‌లోని ఎన్టీఆర్ గ్లింప్స్ అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి.పాట‌లోని నిర్మాణ విలువ‌లు, గ్రిప్పింగ్ విజువ‌ల్స్‌, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి.

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -