కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్టును తొలుత అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ డేట్ చేంజ్ అయింది. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్, కొరటాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు,ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.