కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో దేవర సినిమా తెరకెక్కుతునన సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ , ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, ఫియర్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.
రెండో పాటను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకోసం డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పూర్తి రొమాంటిక్ మోడ్‌లో ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఈ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేయగా సాంగ్ విడుదల తర్వాత ఎలా ఆకట్టుకుంటోందో వేచిచూడాలి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.