Tuesday, May 6, 2025
- Advertisement -

చిరంజీవికి వినాయక్ గుడ్ బై చెప్పేసాడా..?

- Advertisement -

వివి వినాయక్ మెగా కాంపౌండ్ ను విడిచి రాకపోవడంతో…. అంతా చిరు ప్రెస్టీజియన్ ఫిలిం ఇతగాడిదే  అనుకున్నారు.అలాంటి సీన్ ను వినాయక్ ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాడు. కాని ఇపుడున్న సీన్ చూస్తే… అంతటి సీన్ వినాయక్ కి లేదోమో అనిపిస్తుంది.

చిరు వినాయక్ ను ఈమధ్య అస్సలు పట్టించుకోవడం లేదట. దాంతో చిరుకు వినాయక్ గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నాడట.

దీంతో పరిశ్రమలో వినాయక్ తర్వాతి స్టెప్ పై గట్టిగానే చర్చ నడుస్తోంది. అసలు చిరు అఖిల్ చిత్రం ఫలితం చూసి వినాయక్ ను వర్త్ ఫుల్ డైరెక్టర్ గా ఎందుకు చూడటం లేదో మెగా కాంపౌండ్ కే అర్ధం కావడం లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం మార్కెట్లో ఎవ్వరికి సీన్ ఉంటే వారి రాజ్యమే నడుస్తోంది కాబట్టి మనం కూడా ఆ యాంగిల్లోనే ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వినాయక్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక వినాయక్ కూడా ఇంకా మెగా కాంపౌండ్లోనే ఉండి టైమ్ వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనే ఆలోచనకు వచ్చేశాడట.దీంతో తనని ఎప్పుడూ గౌరవించే తారక్ తో ఓ సినిమా ఎందుకు చేయకూడదనే అభిప్రాయానికి వచ్చేసినట్లుగా తెలుస్తోంది.

ఆల్రెడీ  ఇదే విషయమై గత రెండు నెలల నుంచి స్టోరీ సిట్టింగ్స్  కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో తారక్ తో తన ముచ్చటగా మూడో చిత్రం గురించి వినాయక్ స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నట్లు ఫిలింనగర్లో జోరుగా రూమర్లు రౌండ్లు కొడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -