Monday, May 5, 2025
- Advertisement -

మహేష్ సినిమాకి బంఫర్ ఆఫర్

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాంప్లీట్ అవ్వగానే కోలీవుడ్ దర్శకుడు ఏ.ఆర్.మురుగుదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరో గా ఒక చిత్రం రూపొందబోతుంది. ఈ చిత్రాన్ని ముంబాయి బ్యాక్ డ్రాప్ తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ భాషల్లో రూపొందించాలని ప్లాన్ చేసారు. మహేష్ -మురుగుదాస్ కెరీర్ లో ఎప్పుడూ చెయ్యని పెద్ద బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేసారు. ఐతే ఈస్ట్ గోదావరి రైట్స్ ని రూ.6.80 కోట్లకు ఈ చిత్రమేకర్స్ ఆఫర్ చేసారు.ఆ ఏరియా లో ఇప్పటివరకు మరే చిత్రానికి ఇంత పెద్ద మొత్తం పెట్టి రైట్స్ ని సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.

గతం లో ‘బాహుబలి ‘ చిత్రాన్ని రూ.5.25 కోట్లకు సొంతం చేసుకున్నారు.సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే డిస్ట్రిబ్యుటర్స్ చిత్రమేకర్స్ వద్దకు వెళ్లి వారి రైట్స్ ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్తున్నారు. పెద్ద బడ్జెట్ ఎంటర్టైనర్స్ సెట్స్ పైకి వెళ్ళక ముందు అయితే తక్కువ మొత్తం లో రైట్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అని డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ప్లాన్ చేస్తుంటారు. మహేష్ -మురుగుదాస్ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -